News and Entertainment

డేంజర్: బయటపడ్డ 777888999 నెంబర్ రహష్యం


వాట్సాప్ యూజర్స్ కు విజ్ఞప్తి..! దయచేసి ఈ మెసేజ్ ని జాగ్రత్తగా చదవండి. రాత్రి 12 నుంచి 3గంటల లోపు మీకు 777888999 అనే నెంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయకండి. ఇది 9 అంకెల నెంబర్. ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేయకండి... ఇప్పటికే ఈ కాల్ లిఫ్ట్ చేసి 10 మంది చనిపోయారు. ఈ కాల్ లిఫ్ట్ చేస్తే ఒక అమ్మాయి మాట్లాడుతుంది... ఇదు మీకు లాస్ట్ కాల్ అని చెబుతుంది. ఈ కాల్ ద్వారా వైరస్ వస్తుంది. వెంటనే మీ ఫోన్ పేలిపోయి మీరు చనిపోతారు. దయచేసి ఈ విషయాన్ని అందరికి షేర్ చేయండి...!

ఇందులో నిజమెంతుందో.. ఇప్పుడే తెలుసుకోండి..!!
ఈ కాలంలో నిజాలకన్నా.. అబద్ధాలనే ఎక్కువగా నమ్ముతున్నారు ప్రజలు. ఇక స్మార్ట్ ఫోన్స్ లో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలు తెగ హడావిడి చేస్తున్నాయి. నిజానికి పైన చెప్పిన మెసేజ్ అక్షరాలా ఫేక్. కనడ న్యూస్ ఛానల్ ఒకటి టీఆర్పీ ల కోసం చేసిన ఓ చీప్ ట్రిక్. ఈ విషయాన్ని చాలా మంది నమ్మి మోసపోతున్నారు. ఇందులో మీరు కూడా ఉండేఉంటారు. మనతో పాటు మన కుటుంబసభ్యులు, బంధుమిత్రులు సురక్షితంగా ఉండాలని ఇలాంటి మెసేజెస్ నిజమైనా, అబద్ధమైనా వెంటనే ఫార్వర్డ్ చేస్తుంటాం. కాని ఈ మెసేజ్ మాత్రం ఫేక్ అని తేలిపోయింది.
లేటెస్ట్ టెక్నాలజీ పై పట్టు ఉన్న మా టీం మెంబెర్స్ ఈ విషయం పై పరిశోధన జరిపారు. ఇందులో నిజం లేదని.. అసలు ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు జరగలేదని... ఇక మీదట కూడా జరగబోవని తేల్చి చెప్పారు. బహిరంగ ప్రదేశాలలో మెరుపులు వచ్చినప్పుడు లేదా ఛార్జింగ్ పెట్టి స్మార్ట్ ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా రామాధం జరిగే అవకాశముంది గాని ఇలా ఒక ఫోన్ కాల్ ద్వారా మనిషి చనిపోడం లేదా వైరస్ ని వ్యాపింపజేయడం లాంటివి కుదరని పనులు అని స్పష్టం చేశారు.