News and Entertainment

గురువారం ఆంజనేయ స్వామిని ఇలా పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగి విజయం సాధిస్తారు..


మనం నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుకుంటాము. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తి పెరగటమే కాక అందాన్ని పెంచుతుంది. నిమ్మ వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి ఇదంతా సైన్స్… అలాగే నిమ్మకాయలకు దిష్టి దోషాలను, ప్రతీత శక్తులను తొలగించే అతీత శక్తులున్నాయని చాలా మంది నమ్మకం. నమ్మకాలన్నీ నిజాలా..? అంటే చెప్పలేం కానీ…నమ్మకమనేది ఓరకమైన బలమే అనేది మాత్రం వాస్తవం… అయితే మనం నిమ్మకాయలతో ఇలా చేస్తే మాత్రం అధ్బుత ఫలితాలు పొందవచ్చు.
* షాపుల ముందు ఇలా వేలాడుతూ…తమ వ్యాపారాలను నాశనం చేయాలనే దుష్ట శక్తులనుండి రక్షిస్తాయనే నమ్మకం.!
* మంత్రతంత్రాలలో ప్రధానమైన పాత్ర నిమ్మకాయది. భావిస్తారు.!
* అలాగే గురువారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి నాలుగు నిమ్మకాయలు, లవంగాలు తీసుకెళ్ళి పూజ చేయటం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయని నమ్మకం!
* వ్యాపారం బాగా జరగకపోతే… ఒక నిమ్మకాయను తీసుకొని, షాప్ లోని నాలుగు గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయను టచ్ చేసి, ఆ తర్వాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి ఆ నాలుగు దిక్కులలో ఆ నిమ్మకాయ ముక్కలను..


ఉంచటం ద్వారా శని బయటకు వెళ్తుందని నమ్మకం.!
* మన ఇంటి ప్రాంగణంలో ఒక నిమ్మ చెట్టు ఉండటం ద్వారా ఎలాంటి ప్రతీక శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం.!
* అలాగే మన ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలున్నా నిమ్మ చెట్టు ఉండటం వలన వాస్తు సెట్ అవుతుందంట!
* ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఓ నిమ్మకాయను తీసుకొని కింద నుండి పై వరకూ వారిని చూస్తూ దిష్టి తీసి, దానిని నాలుగు సమాన భాగాలుగా కోసి, ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయాలి. వాటిని అక్కడే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఇలా చేయటం ద్వారా ఆ దిష్టి పోతుందంట!
ఇలాంటివి నమ్మని వాలకు ఈ నియమాలు వర్తించవ్. ఎందకంటే ఎవరి నమ్మకం వాళ్లది.