News and Entertainment

ఖైదీ నెంబర్ 150 : రివ్యూ



10:50pm :  క్లయిమాక్స్ లో కోర్టు సన్నివేశాలు వస్తున్నాయి. ఇద్దరు చిరంజీవిలు ఒకరినొకరు చూసుకుంటారు.  కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో సినిమా పూర్తి అయ్యింది.

10:46 pm :  తరుణ్ అరోరా, దొంగ చిరంజీవి మద్య కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.

10:46 pm :  తరుణ్ అరోరా, దొంగ చిరంజీవి మద్య కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.  సినిమా క్లయిమాక్స్ దిశగా సాగుతుంది.

10:44pm :  రాష్ట్ర వ్యాప్తంగా  రైతులు  ఎదుర్కొంటున్న కరువు పరిస్థితి   సమస్యల గురించి చిరంజీవి చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ తో అదరగొడుతున్నాడు. సినిమా అంతా ఒక్కసారే ఎమోషన్ గా మారిపోయింది.

10:40 pm : సినిమాలో మరో ట్విస్ట్ వస్తుంది. దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

10:35 pm : అమాయక చిరంజీవి పోలీసుల వద్ద లొంగిపోతాడు. తరుణ్ అరోరా చిరంజీవిని కిడ్నాప్ చేస్తాడు. చిరంజీవిని  కార్పోరేట్ కంపెనీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని బెదిరిస్తాడు. పైప్ మీటింగ్ కి ఎలా వెళ్తావని అవహేళన చేస్తాడు.

10:30 pm : సినిమాలో ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.

10:26 pm : సినిమాలో ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు వస్తున్నాయి. చిరంజీవి రెండు పాత్రల్లో చాలా అద్భుతంగా నటిస్తున్నాడు.

10:22 pm :  చిరంజీవి ఓ పథకం ఆలోచిస్తాడు. నీటీ పైప్ లైన్ బ్లాక్ చేస్తే మీడియా దాన్ని సెన్సేషన్ చేస్తుందని భావిస్తాడు.

10:20  pm :  చిరంజీవి చేసిన ప్రయత్నాలు ఇక్కడ విఫలం అవుతాయి. నోటీసుల గురించి మీడియా మరియు ప్రభుత్వ కనీసం ఈ గురించి చూపలేక పోతాయి. అంతే కాదు ‘జీరో’ వార్తలని కొట్టి పడేస్తాయి.

10:17 pm :  గ్రామానికి సంబంధించిన కేసు కోర్డుకు వస్తుంది.  యువకులు తము పడుతున్న బాధ నిరూపించకపోతు. ఎంఎన్ సికి అనుకూలంగా పోతుందని చెబుతారు.

10:15  pm : సినిమాలో ఇప్పుడు ‘నాణేలకు’ సంబంధించిన ఫైట్ సీన్ వస్తుంది. చిరంజీవి తన విశ్వరూపాన్ని చూపించాడు. థియేటర్లో చప్పట్లు, ఈలలు వేస్తున్నారు.

10:13  pm : అమాయక చిరంజీవి జైలు నుంచి తప్పించుకుంటాడు.

10:10  pm : తరుణ్ అరోరా కి వెతిరేకంగా కమీషనర్  ప్రవర్తించడంతో అతనిని చంపేస్తాడు.

10:06 pm : తరుణ్ అరోరా కమీషనర్ ని డబ్బుతో కొనేస్తాడు. తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని ఆర్డర్ వేస్తాడు. అప్పుడు చిరంజీవి తనదైన స్టైల్లో కమీషనర్ ని అదరగొడతాడు.

10:03 pm : సినిమాలో మరో పాట వస్తుంది. అద్భుతమైన పిక్చరైజేష్, కాజల్ చాలా అందంగా ఉంది.



10:02 pm : కాజల్, చిరంజీవిని లవ్ చేస్తున్నట్లు చెబుతుంది. ప్రస్తుతం కొన్ని అనవసరపు సీన్లు వస్తున్నాయి.

9:59 pm : తరుణ్ అరోరా మరోసారి చిరంజీవికి వార్నింగ్ ఇస్తాడు..అప్పుడు చిరంజీవి ఐ యామ్ వెయిటింగ్ అంటాడు.  సినిమాలో కొన్ని లోపాల మినహా అద్భుతంగా రన్ అవుతుంది.

9:57 pm : వృద్దాశ్రమంలోకి కొంత మంది రౌడీలను పంపించి కొట్టించాలని చూస్తాడు. అప్పుడు చిరంజీవి ఎంట్రీ ఇస్తాడు..సూపర్ ఫైటింగ్ సిన్ వస్తుంది.

9:55 pm : దొంగ చిరంజీవికి ఫ్లాష్ బ్యాక్ విని హృదయం కరిగిపోతుంది. ఎంఎన్ సి నుంచి డబ్బులు తిరిగి తీసుకు రావాలని నిశ్చయించుకుంటాడు.

9:53 pm : సినిమాలో ఇప్పుడు రైతులకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. వ్యవసాయదారులు హత్యకు గురిఅవుతుంటారు. ప్రస్తుతం ఓ ఫైట్ సీన్ వస్తుంది.

9:49 pm : ఇప్పుడు పూర్తిగా కొత్తరూపంలో ఉన్న చిరంజీవి ఎంట్రీ ఇచ్చాడు.  

9:47 pm : లయన్స్ క్లబ్ వద్ద అమాయక చిరంజీవి పై సిన్లు వస్తున్నాయి

9:45 pm : లయన్స్ క్లబ్ వద్ద అమాయక చిరంజీవి పై సిన్లు వస్తున్నాయి.   సినిమా లో ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు వస్తున్నాయి.

9:43 pm :  వృద్దాశ్రమం జోలికి వెళ్లవద్దని రౌడీలకు స్వీట్ వార్నింగ్ ఇస్తాడు చిరంజీవి.

9:40 pm :  తరుణ్ అరోరా చిరంజీవికి భారీ ఆఫర్ ఇస్తాడు.  తనకు డబ్బు ఆశ చూపించి విదేశాలకు పొమ్మని హెచ్చరిస్తాడు.

9:38 pm :  ప్రస్తుతం చిరంజీవిని చంపడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారు. సినిమాలో కాస్త ఎమోషనల్ సీన్లు వస్తున్నాయి.

9:35 pm : సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.  ఇప్పుడు అమాయక చిరంజీవి ఆసుపత్రిలో మేల్కొంటాడు. అద్భుతమైన ట్విస్ట్ వచ్చింది.

9:30 pm : సినిమాలో ప్రస్తుతం ఓ పాట వస్తుంది . ఫ్యుజువల్స్ చాలా బాగున్నాయి.  చిరంజీవి చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు.

9:22 pm : ప్రస్తుతం కాజల్, చిరంజీవిల మద్య ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు వస్తున్నాయి. ఓ వార్డు కౌన్సిలర్ గురించి కాజల్, చిరుని సహాయం అడుగుతుంది.

9:15 pm : వృద్దాశ్రమంలో ఓ ముసలాయనకు గుండెపోటు వస్తుంది. అప్పుడు చిరంజీవి కోసం కొంత మంది వచ్చి సహాయం అడుగుతాడడు.

9:09 pm : వృద్దాశ్రమంలో ఓ ముసలాయనకు గుండెపోటు వస్తుంది. అప్పుడు చిరంజీవి కోసం కొంత మంది వచ్చి సహాయం అడుగుతాడడు. అప్పుడే కరెంట్ పోయింది..అదే సమయంలో చిరంజీవి ఓ వ్యక్తి చెంపపై కొడతాడు..కరెంటు రాగానే ఆశ్చర్యం అతను కొట్టింది కాజల్ ని అని తెగ ఫీల్ అవుతాడు.

8:59 pm :  విలన్ తరుణ్ అరోరా ఎంట్రీ ఇచ్చాడు.  కొన్ని కామెడీ సీన్లు వస్తున్నాయి.

8:55 pm :  వృద్ధాశ్రమంలోని వృద్దులు చెక్ ని చించివేశారు. చిరంజీవి మరో మార్గంతో ఆ డబ్బుని తీసుకోవాలని ప్లాన్ వేశాడు. దీనికోసం ఆ వృద్దశ్రమంలోనే ఉండటానికి నిశ్చయించుకున్నాడు.

8:50 pm :  చిరంజీవి, ఆలీ రోడ్ పై నడుస్తూ వెళ్తున్నారు. వారిని కలెక్టర్ కలిసి భారీ మొత్తం చెక్ ఇస్తాడు. తర్వాత కలెక్టర్ చిరంజీవిని ఓ వృద్దాశ్రమానికి తీసుకు వెళ్తాడు.

8:48 pm :  సినిమా లో ఇప్పుడు ట్విస్ట్ వచ్చింది.  చిరంజీవిపై కొంత మంది కాల్పులు జరుపుతున్నారు.

8:44 pm :  కాజల్ ని చూసిన ఫస్ట్ లుక్ లోనే ప్రేమలో పడ్డాడు చిరంజీవి. ఆమె కోసం ఇండియాలోనే ఉండాలని నిశ్చయించుకున్నాడు.

8:38 pm :  చిరంజీవి విదేశాల్లో తిరగాలని తెగ ఆరాట పడుతుంటాడు..ఈ విషయం ఆలీతో చెబుతాడు. ఎయిర్ పోర్ట్ సీన్లు చాలా బాగున్నాయి. అందాల భామ కాజల్ ఎంట్రీ ఇచ్చింది.

8:33 pm : జైలు నుంచి తప్పించుకున్న చిరంజీవి తన స్నేహితుడు ఆలీ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు దేశం నుంచి తప్పించుకునేందుకు పాస్ పోర్ట్ తయారు చేసుకుంటున్నాడు. ఆలీతో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి.

8:30 pm : జైలు నుంచి దొంగ ఎలా తప్పించుకున్నాడో పోలీసులకు దగ్గరుండి మరీ చూపిస్తున్నాడు. చిరంజీవి పారిపోతున్న దొంగను పట్టించి అక్కడ నుంచి తప్పించుకున్నాడు.

8:26 pm : జైలు బ్లూప్రింట్ డిజైన్ చూపించేటపుడు గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. డీఎస్పీ సమక్షంలో ఓ దొంగ ఎస్కేపింగ్ గురించి చెబుతున్నాడు చిరంజీవి.

8:22 pm : ఈ సారి చిరంజీవి  కొన్ని పరిస్థితులు కాప్స్ సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు.   జైలు బ్లూప్రింట్ డిమాండ్ చేస్తాడు.  ప్రస్తుతం జైలు సన్నివేశం ఇంట్రెస్టింగ్ గా ఉంది.

8:18pm : పోలీసులు చిరంజీవిని చుట్టు ముట్టారు.  జైలు వార్డన్ కొట్టి మరోసారి తప్పించుకుంటున్నాడు చిరంజీవి.

8:15 pm : సినిమా ఇప్పుడే మొదలైంది..చిరంజీవి జైలు సిబ్బందితో మాట్లాడుతున్నాడు. వారికి మస్కా కొట్టి జైలు నుంచి తప్పించుకున్నాడు. చిరంజీవి కోసం పోలీసుల వేట మొదలైంది.

8:13 pm : తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి చిత్రం కోసం థియేటర్లో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

8:10 pm : వివివినాయక్ దర్శకత్వం లో  మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా ట్విట్, రివ్యూ కి స్వాగతం