News and Entertainment

షాకింగ్: హాల్ టికెట్‍లో స్టార్ హీరొయిన్ నగ్న ఫొటో


పాట్నాకు చెందిన ఓ విద్యార్ధిని హాల్ టికెట్ ప్రస్తుతం ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. బిహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(బీఎస్ఎస్‍సీ) ఈ నెల 8న ఎస్ఎస్సీ ఇంటర్ లెవల్ పరీక్షల హాల్ టికెట్లను జారీ చేసింది. అయితే ఓ హాల్ టికెట్ చూసుకున్న ఓ విద్యార్థిని షాక్ కు గురైంది. ఆ హాల్ టికెట్లో తన ఫొటోకు బదులుగా మరోకరి ఫొటో వచ్చింది. అందులోనూ స్టార్ హీరోయిన్ టాప్ లెస్ ఆ ఫొటో దర్శనమివ్వడంతో విద్యార్థినికి ఏం చేయాలో తెలియక ఆందోళన చెందింది.

ఈ ఫొటోను ఓసారి పరిశీలించినట్లయితే.. బిహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(బీఎస్ఎస్‍సీ) హాల్ టికెట్ లో  ఫస్ట్ ఇంటర్ లెవల్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామ్-2014 అని ఉంది. నలంద జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని పేరుతో ఉన్న నటి టాప్ లెస్ ఫొటోను జనరల్ నాలెడ్జ్ పేపర్ అడ్మిట్ కార్డులో ప్రింట్ చేశారు. ఆ విద్యార్దిని ఈ పరీక్షను ఫిబ్రవరి 26 న రాయాల్సి ఉంది. ఈ ఫోటోను ఆ అమ్మాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో విద్యార్థిని అడ్మిట్ కార్డ్ వైరల్ గా మారింది. దీనిపై బీఎస్ఎస్సీ అధికారుల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.